ఇలా అప్లై చేయండి..

  • ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ sbi.co.in ను ఓపెన్ చేయండి.
  • హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న కెరీర్స్ లింక్ పై క్లిక్ చేయండి.
  • కొత్త పేజీ ఓపెన్ అవుతుంది, అక్కడ అభ్యర్థులు ఎస్బీఐ ఎస్సీఓ లింక్ పై క్లిక్ చేయాలి.
  • అప్లై ఆన్ లైన్ లింక్ అందుబాటులో ఉన్న చోట డ్రాప్ డౌన్ బాక్స్ ఓపెన్ అవుతుంది.
  • దానిపై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి.
  • ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ నింపి అవసరమైన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాలి.
  • అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • సబ్మిట్ పై క్లిక్ చేసి పేజీని డౌన్ లోడ్ చేసుకోండి.
  • తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని ఉంచండి.

అప్లికేషన్ ఫీజు

దరఖాస్తు ఫీజుగా జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.750 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఎలాంటి ఫీజు, ఇన్ఫర్మేషన్ ఛార్జీలు ఉండవు. డెబిట్ లేదా క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ మొదలైన వాటిని ఉపయోగించి అప్లికేషన్ ఫీజును చెల్లించవచ్చు. అభ్యర్థులు చెల్లుబాటు అయ్యే ఈ మెయిల్ ఐడీ, మొబైల్ ఫోన్ నంబర్ కలిగి ఉండాలి. ఇవి కనీసం ఈ రిక్రూట్మెంట్ (recruitment) ఫలితాలు ప్రకటించే వరకు, తుది ఎంపికపై కాల్ లెటర్లు జారీ చేసే వరకు యాక్టివ్ గా ఉండాలి. కాల్ లెటర్/ఇంటర్వ్యూ కు సంబంధించిన వివరాలను అభ్యర్థులు ఆ ఈ మెయిల్, మొబైల్ నంబర్ ల ద్వారా పొందుతారు. అర్హతలు, ఇతర పూర్తి వివరాల కోసం అభ్యర్థులు ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ sbi.co.in లోని నోటిఫికేషన్ ను పరిశీలించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here