గూగుల్ సెర్చ్ లో మరో కొత్త ఫీచర్ ఏంటి?
సెర్చ్ పేజీ లేఅవుట్ ను నిర్వహించడానికి గూగుల్ ఏఐని ఉపయోగిస్తుంది ‘‘మీరు ఇప్పుడు మీ సెర్చ్ ఫలితాలతో పూర్తి పేజీని చూస్తారు. మీ ప్రశ్నకు స్పష్టమైన సంబంధిత ఫలితాలను పొందుతారు’’ అని గూగుల్ సెర్చ్ వీపీ, హెడ్ లిజ్ రీడ్ అధికారిక సంస్థ బ్లాగ్ పోస్ట్ చేశారు. ‘‘వ్యాసాలు, వీడియోలు, ఫోరమ్ లు సహా మరెన్నో వెబ్ అంతటా ఉన్న కంటెంట్ ను మీరు ఒకేచోట సులభంగా అన్వేషించవచ్చు’’ అని వివరించారు. ఏఐ ఓవర్ వ్యూ కోసం కొత్త డిజైన్ ను పరీక్షిస్తున్నామని, ఇది AI ఓవర్ వ్యూ టెక్స్ట్ లో నేరుగా ప్రముఖ లింక్ లను జోడిస్తుందని కంపెనీ తెలిపింది