ముంబైలో మరొకటి..
బెంగళూరుతో పాటు, ఆపిల్ పూణే, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబైలలో కొత్త రిటైల్ స్టోర్ల ను తెరవాలని ఆపిల్ భావిస్తోంది. ఆపిల్ రిటైల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డియర్డ్రే ఓ’బిరెన్ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా, ఐఫోన్-16ను భారత్ లోనే తయారు చేస్తున్నట్లు ఆపిల్ తెలిపింది. ఐఫోన్ (iphone) 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ తో సహా మొత్తం ఐఫోన్ 16 లైనప్ ను ఆపిల్ ఇప్పుడు భారతదేశంలోనే ఉత్పత్తి చేస్తోందని ఆపిల్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇప్పటి వరకు ప్రామాణిక ఐఫోన్ మోడళ్లను మాత్రమే భారత్ లో తయారు చేసేవారు. ఉదాహరణకు ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్.. మొదలైనవి. కాగా, ఆపిల్ 2017 లో భారతదేశంలో ఐఫోన్ల తయారీని ప్రారంభించింది.