దేశంలో పండగ సీజన్​ నేపథ్యంలో ఇప్పుడు దాదాపు అన్ని ప్రముఖ ప్రాడక్ట్స్​పై భారీ డిస్కౌంట్స్​ లభిస్తున్నాయి. ఇక ఇప్పుడు దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ టీవీఎస్​ కూడా తన బెస్ట్​ సెల్లింగ్​ ఐక్యూబ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​పై మంచి డిస్కౌంట్​, ఆఫర్స్​ని ప్రకటించింది. టీవీఎస్ ఐక్యూబ్ 2.2 కిలోవాట్, ఐక్యూబ్ 3.4 కిలోవాట్, ఐక్యూబ్ ఎస్ 3.4 కిలోవాట్ వేరియంట్లపై గరిష్ఠంగా రూ.20,000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఈ ఆఫర్లు అక్టోబర్ 31, 2024 వరకు అందుబాటులో ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. ఈ మోడల్స్​ గరిష్ఠంగా 100కి.మీ వరకు రేంజ్​ని ఇస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here