జెరోధా ప్రారంభం

తన వ్యక్తిగత హోమ్ పేజ్ వెబ్ సైట్ లో తాను సగటు విద్యార్థినని, 17 ఏళ్ల వయసులో అనుకోకుండా ట్రేడింగ్, స్టాక్ మార్కెట్ (stock market) వైపు వెళ్లానని నితిన్ కామత్ పేర్కొన్నాడు. ‘‘2000 దశకం ప్రారంభంలో, నేను అప్పు చేసి నా ట్రేడింగ్ ఖాతాను ప్రారంభించాను. ఆపై అప్పు తీర్చడానికి 4 సంవత్సరాలు కాల్ సెంటర్లో పనిచేశాను. అదే సమయంలో ట్రేడింగ్ కూడా చేశాను’’ అని నితిన్ కామత్ తన వ్యక్తిగత హోమ్ పేజీలో వివరించారు. రిలయన్స్ (reliance) మనీ అనే బ్రోకరేజీ సంస్థకు తాను ఫ్రాంచైజీగా మారి అడ్వయిజరీ ప్రారంభించానని కామత్ తెలిపారు. ఈ సమయంలో అతని తమ్ముడు నిఖిల్ కామత్ కూడా అతనితో జత కలిశాడు. తన తమ్ముడు ట్రేడింగ్ (trading) చేస్తుండటంతో ట్రేడర్లుగా తమకు అవసరమని భావించిన బ్రోకరేజీ సంస్థను నిర్మించడానికి కొంత సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వెబ్సైట్ పేర్కొంది. 2010 లో, వారు జెరోధాను స్థాపించారు. బ్రోకరేజ్ సంస్థను ప్రారంభించడానికి “తగినంత డబ్బును” సమీకరించారు. “మేము ఒక చిన్న బృందంగా ప్రారంభించాము. విద్యాపరంగా, సాంకేతికతంగా ఎటువంటి నేపథ్యం లేదు. అనుభవం లేదు. కానీ క్యాపిటల్ మార్కెట్ల పట్ల అభిరుచి, మా వంటి ఇతర వ్యాపారులకు సహాయం చేయాలనే ఉద్దేశ్యం మాత్రం ఉంది’’ అని నితిన్ కామత్ చెప్పారు. జెరోధా రూ.8,320 కోట్ల ఆదాయం, రూ.4,700 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు సెప్టెంబర్ 25న మింట్ నివేదించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here