మూవీ : బాలు గాని టాకీస్

నటీనటులు: శివకుమార్ రామచంద్రపు, శరణ్య శర్మ, రఘు కుంచె, సుధాకర్ రెడ్డి, జబర్దస్త్ ఇమ్మాన్యుయల్ తదితరులు

ఎడిటింగ్: అన్వర్ అలీ

సినిమాటోగ్రఫీ: బాలు సండిల్యస

మ్యూజిక్: ఆదిత్య బి.ఎన్

నిర్మాతలు : శ్రీనిధి సాగర్, శివ

దర్శకత్వం: విశ్వనాథన్ ప్రతాప్

ఓటీటీ: ఆహా

కథ: 

అనగనగా ఓ ఊరు.. ఆ ఊర్లో బాలయ్య బాబు అభిమాని బాలు. ఇల్లులా భావించే థియేటర్ కి యజమాని అతను. ఈతరం జనరేషన్ ని ఆకట్టుకునేలా సినిమాలని రిలీజ్ చేయాలని, అందులో‌ను బాలయ్య బాబు సినిమాని ఆడించాలని కలలు కంటాడు. ఊరంతా కలిసి బాలు గాని టాకీస్ లో కొత్త సినిమాలు చూడడానికి వచ్చేవారు కాదు. కానీ బాలుకి ఎటు చూసిన అప్పులే.. ఏం జీవితంరా అని అనుకుంటున్న బాలు.. ఐదారుగురైన వస్తారని బూతు బొమ్మల సినిమాలు వేస్తాడు. అలా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న బాలు గానీ టాకీస్(Balu gani talkies) లో ఓ ముసలాయన చనిపోతాడు. అయితే బాలు గానీకి ఓ మేనమామ ఉంటాడు. అతని కూతురికి బాలు గంటే ఇష్టం.. అలాగే బాలు గానీకి టాకీస్ తో పాటు మరదలు ఇష్టమే. కానీ మేనమామకి బాలుకీ పాత గొడవలు ఉంటాయి. అయితే బాలు గానీ టాకీస్(Balu gani talkies) లో‌ ముసలాయన ఎలా చనిపోయాడు? మేనమమాతో బాలు గానీ గొడవేంటి? బాలు గానీ టాకీస్ లో బాలయ్య బాబు సినిమా రిలీజ్ చేయగలిగాడా లేదా అనేది మిగతా కథ.

విశ్లేషణ: 

రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో‌ సాగే కథ ఇది.  అయితే ఇది బాలయ్య బాబు అభిమాని కథ.‌ కానీ దర్శకుడు విశ్వనాథన్ ప్రతాప్ కాస్త భిన్నంగా ప్రెజెంట్ చేశాడు. 1990 కు ముందు పాత టాకీస్ లలో‌ బూతు బొమ్మలు ప్రదర్శించేవారు. దానికోసం కొంతమంది ఎగబడేవారు. దానిని కళ్ళకి కట్టినట్లు చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. 

అయితే ఈ సినిమాలో అసలు కథ ప్రారంభించడానికి దర్శకుడు కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడు. ఇక ఇంటర్వెల్ నుండి కథ సెట్ అవుతుంది. కానీ మధ్యమధ్యలో కొన్ని అడల్ట్ సీన్లు, మాటలు ఇబ్బంది పెడతాయి. ఫ్యామిలీతో కాకుండా ఒంటరిగా చూడడమే బెటర్. ఇక కథలో సెకెంఢాఫ్ లో వచ్చే ట్విస్ట్ లు, కామెడీ, డ్రామా అన్నీ వర్కవుట్ అయ్యాయి.

సినిమా ఫస్ట్ సీన్ లో చూపించే లీక్.. ఎండింగ్ లో లింక్ చేయడం బాగుంది. అయితే హీరోకి మేనమామగా చేసిన క్యారెక్టర్, మరదలి నిడివి కాస్త ఇబ్బందే. డీసెంట్ కామెడీ డ్రామా ఉంది కానీ  కాస్త డీటేయిలింగ్ ఎక్కువగా చూపించారనిపిస్తుంది. ఓకే బిజిఎమ్. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. 

నటీనటుల పనితీరు: 

బాలు పాత్రలో శివకుమార్ రామచంద్రపు ఒదిగిపోయాడు. సినిమాని తన భుజాలపై మోశాడు.‌ ముందు వరకు సపోర్ట్ రోల్ లో చేసిన శివకుమార్.. కథానాయకుడిగా ఆకట్టుకున్నాడు.  బాలు బాబాయ్ గా రఘు కుంచె నటన బాగుంది. హీరోయిన్ శరణ్య శర్మ ఆకట్టుకుంది. ఇక మిగతావారు వారి పాత్రల పరిధి మేర నటించారు. 

ఫైనల్ గా : డీసెంట్ కామెడీ థ్రిల్లర్.. పెద్దలకు మాత్రమే.

రేటింగ్: 2.5 / 5

✍️. దాసరి మల్లేశ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here