Yasin Malik: తాను ఇప్పుడు ఆయుధాలు త్యజించి, గాంధేయ మార్గంలో పోరాటం చేస్తున్నానని కశ్మీర్ వేర్పాటు వాద నేత, జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్-యాసిన్ (JKLF-Y) చైర్మన్ యాసిన్ మాలిక్ వెల్లడించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) ట్రిబ్యునల్ కు సమర్పించిన అఫిడవిట్ లో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. 1994లోనే సాయుధ పోరాటాన్ని విరమించుకున్నానని, బదులుగా, గాంధేయ ప్రతిఘటన మార్గాన్ని ఎంచుకున్నానని తెలిపారు. జేకేఎల్ఎఫ్-వైపై నిషేధాన్ని యూఏపీఏ ట్రిబ్యునల్ సమీక్షించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం 1967 ప్రకారం జేకేఎల్ ఎఫ్ -వైని ‘చట్టవ్యతిరేక సంఘం’గా పేర్కొంటూ యూఏపీఏ ట్రిబ్యునల్ గత నెలలో జారీ చేసి గురువారం గెజిట్ లో ప్రచురించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here