35 – చిన్న కథకాదు చిత్రానికి నంద కిశోర్ ఇమానీ దర్శకత్వం వహించారు. తన కుమారుడిని మ్యాథ్స్ సబ్జెక్టులో పాస్ అయ్యేలా చేసేందుకు ఓ మధ్యతరగతి తల్లి చేసే ప్రయత్నం చుట్టూ ఈ మూవీ సాగుతుంది. మధ్యతరగతి కుటుంబ పరిస్థితులను, ఆలోచనలను ఈ చిత్రంలో డైరెక్టర్ ఆకట్టుకునేలా చూపించారు. ఈ మూవీలో ఇద్దరు పిల్లల అమ్మగా నివేదా థామస్ నటించారు. స్కూల్‍లో ఉపాధ్యాయుడి పాత్రను ప్రియదర్శి పోషించారు. పిల్లాడు అరుణ్ పాత్ర చేసిన అరుణ్ దేవ్ మెప్పించారు. విశ్వదేవ్ కూడా ఆకట్టుకున్నారు. గౌతమి, భాగ్యరాజ్, కృష్ణ తేజ కీరోల్స్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here