జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘దేవర’ (Devara) మూవీ సెప్టెంబర్ 27న విడుదలైంది. డివైడ్ టాక్ తోనూ అదిరిపోయే వసూళ్లతో బ్రేక్ ఈవెన్ సాధించింది. వరల్డ్ వైడ్ గా రూ.180 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన దేవర.. కేవలం పది రోజుల్లోనే రూ.220 కోట్లకు పైగా షేర్(రూ.400 కోట్ల గ్రాస్)తో సంచలనం సృష్టించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, నార్త్, ఓవర్సీస్ ఇలా అన్ని చోట్లా మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. దాదాపు అన్ని చోట్లా లాభాల్లోకి ఎంటరైంది. కానీ ఒక్క చోట మాత్రం ‘దేవర’కు నిరాశ ఎదురైంది.

తమిళ సినిమాలను తెలుగు ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటారు. కానీ తమిళనాడులో తెలుగు సినిమాలకు ఆ పరిస్థితి ఉండదు. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమాలు తప్ప.. తమిళనాట తెలుగు సినిమాలు పెద్దగా ఆదరణకు నోచుకోవు. అందుకే తెలుగు చిత్రాలకు తమిళ్ లో పెద్దగా బిజినెస్ కూడా జరగదు. ‘దేవర’ కూడా తమిళ్ లో రూ.6 కోట్ల థియేట్రికల్ బిజినెస్ మాత్రమే చేసింది. అయినప్పటికీ బ్రేక్ ఈవెన్ సాధించడంపై అనుమానం కలుగుతోంది. దేవర పదిరోజుల్లో తమిళ్ లో రూ.4 కోట్ల షేర్ రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం రూ.2 కోట్ల షేర్ రాబట్టాల్సింది. కానీ ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే ఆ మొత్తం రాబట్టడం ఖాయమనే అనిపిస్తోంది. అదే జరిగితే దేవర తమిళనాడులో మాత్రమే కాస్త నష్టాలను చూసినట్లు అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here