“విభిన్న భాషలు, సంప్రదాయాలకు నెలవు తెలంగాణ. భారత దేశ బహుళత్వం, కలుపుకోలు తనానికి తెలంగాణ వెన్నెముకగా నిలుస్తూ వస్తోంది. నార్త్​ కరోలినా, చార్లెట్టే సిటీ కలిసిగట్టుగా ఉండేందుకు తెలుగు భాష మాట్లాడే సమాజం కృషి చేస్తోంది. తెలంగాణ నుంచి వచ్చిన చార్లెట్టేలోని తెలుగు సమాజం ఇక్కడి సంప్రదాయ వైవిధ్యాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళుతోంది. అంతేకాకుండా నార్త్​ కొరిలినాలోని వైద్య, ఇంజినీరింగ్​, రాజకీయ, లీగల్​, సంక్షేమ రంగాల్లోనూ చురుకుగా పాల్గొంటోంది. అందుకే తెలంగాణ ప్రజలు జరుపుకునే బతుకమ్మ పండుగకు అధికారిక గుర్తింపును ప్రకటిస్తున్నాము. అక్టోబర్​ 3 నుంచి 11 వరకు తెలంగాణ హెరిటేజ్​ వీక్​గా ప్రకటిస్తున్నాను,” అని చార్లెట్టే మేయర్​ వీ అలెగ్జ్యాంజర్​ లైలెస్​ చేసిన ప్రకటనలో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here