తెలుగు నాట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan)కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. దాదాపుగా అందరు వీరాభిమానులే. ఈ లిస్ట్ లో సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు నటులు కూడా ఉన్నారు. ఎప్పటికప్పుడు పవన్ గురించి సదరు నటులు చెప్పే మాటలు  వైరల్ కూడా అవుతుంటాయి. 

తాజాగా పవన్ కళ్యాణ్ హాష్ టాగ్  సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ ఎక్స్ లో వైరల్ గా మారింది.ఇందుకు ప్రధాన కారణాలు మూడు. అందులో ఒకటి మీర్జాపూర్ నటుడు పంకజ్ త్రిపాఠి(pankaj tripathi)పవన్ గురించి ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు పవన్ గొప్ప నటుడు, పుస్తకాలు బాగా చదవడంతో పాటుగా ఎంతో దూర ద్రుష్టి ఉన్న వ్యక్తి కూడా. ఈ విషయాన్ని కొంత మంది దర్శకులు నాతో చెప్పారు.ఆయనకి అన్ని భాషల్లో అభిమానులు ఉన్నారని చెప్పుకొచ్చాడు. 

ఇక మిగతా రెండు విషయాలకి వస్తే పవన్ అప్ కమింగ్ మూవీస్ లో ఒకటైన హరి హర వీరమల్లు(hari hara veeramallu)లో పవన్ ఒక సాంగ్ పాడబోతున్నారనే వార్త నెట్టింట హల్ చల్ చేస్తుంది.ఈ మేరకు చిత్ర బృందం నుంచి అధికార ప్రకటన కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. అలాగే మరో అప్ కమింగ్ మూవీ ఓజీ(og)లో తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరో పాట పాడబోతున్నాడనే న్యూస్ కూడా హల్ చల్ చేస్తుంది.ఈ మూడు విషయాల వల్లనే పవన్ హాష్ టాగ్ వైరల్ గా మారింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here