నేడు (అక్టోబర్ 9) దర్శకుడు వి. వి. వినాయక్ (VV Vinayak) పుట్టినరోజు. ‘ఆది’, ‘చెన్నకేశవరెడ్డి’, ‘ఠాగూర్’ వంటి సినిమాలతో తెలుగునాట మంచి కమర్షియల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వినాయక్.. అనారోగ్య కారణాలతో కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన మళ్ళీ మెగాఫోన్ పట్టి అదిరిపోయే కమర్షియల్ సినిమా తీయాలని ఎదురుచూసే వాళ్ళు ఎందరో ఉన్నారు. కాగా నేడు వినాయక్ 50వ పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ స్టార్స్ చిరంజీవి (Chiranjeevi), ప్రభాస్ (Prabhas), రామ్ చరణ్ (Ram Charan) ఆయనను ప్రత్యేకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

చిరంజీవితో ‘ఠాగూర్’, ‘ఖైదీ నెంబర్ 150’, ప్రభాస్ తో ‘యోగి’, రామ్ చరణ్ తో ‘నాయక్’ సినిమాలు చేశారు వినాయక్.

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here