డీఈఈ ఇంట్లో నోట్ల కట్టలు

ఇప్పటి వరకూ బాధితులు లంచగొండి అధికారులను ఏసీబీ పట్టించిన ఘటనలు చూశాం. అయితే తన భార్య కట్టల కట్టల డబ్బులు లంచంగా తీసుకుంటుందని…భర్తే వీడియో తీసి ఇంటర్నెట్ లో పెట్టడం హైదరాబాద్ లో సంచలనం అయ్యింది. మణికొండ మున్సిపల్ మాజీ డీఈఈ దివ్యజ్యోతి కాంట్రాక్టర్ల నుంచి భారీగా లంచం తీసుకున్నారని, ఆమె భర్తే వీడియోలు తీశారు. అవినీతిగా తీసుకున్న నగదును ఇంట్లో ఎక్కడెక్కడ పెడుతున్నారో బయపెట్టారు దివ్యజ్యోతి భర్త శ్రీపాద్. బీరువాలో, పరుపు కింద, దేవుని గుడిలో, కిచెన్ లో, పూల కుండీలో ఎక్కడ పడితే అక్కడే పేపర్లో చుట్టిన నోట్ల కట్టలు ఉన్న వీడియోను శ్రీపాద్ బయట పెట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here