ఇప్పటివరకు నందమూరి బాలకృష్ణను యాక్షన్‌ హీరో, ఫ్యాక్షన్‌ హీరో అని పిలిచేవారు. ఇకపై సూపర్‌హీరో అని పిలవాలంటున్నారు నెటిజన్లు. సాధారణంగా సూపర్‌ హీరోల వేషధారణ చాలా విభిన్నంగా ఉంటుంది. చిన్న పిల్లల్ని ఆకట్టుకునే ఓ కల్పిత పాత్ర సూపర్‌హీరో. అలాంటి అసాధారణమైన క్యారెక్టర్లు చేసేందుకు హాలీవుడ్‌ హీరోలు ఎక్కువగా మక్కువ చూపిస్తారు. ఇప్పుడది టాలీవుడ్‌కి కూడా చేరుకుందని కొన్ని సినిమాల వల్ల తెలుస్తోంది. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై సంచలన విజయం సాధించిన హనుమాన్‌ చిత్రంలో మనకు సూపర్‌హీరో కనిపిస్తాడు. అతను చేసే విన్యాసాలు ప్రేక్షకుల్ని విపరీతంగా థ్రిల్‌ చేశాయి. ఇప్పుడు అలాంటి ఓ సూపర్‌ హీరో వేషధారణలో బాలకృష్ణ కనిపించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 

బాలకృష్ణ సూపర్‌హీరోగా రాబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందనే వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జాగ్రత్తగా పరిశీలిస్తే ఇది ఒక ఫేక్‌ పిక్‌ అనే విషయం  అర్థమవుతుందని కొందరు నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు దీన్ని కొట్టి పారేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ప్రచారంలో ఉన్న మరో రెండు విషయాలు ఏమిటంటే.. బాలయ్య హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్‌3 త్వరలో ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమోలోని స్టిల్‌ అది. రెండోది ప్రశాంత్‌వర్మ.. నందమూరి మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో బాలకృష్ణ కూడా నటిస్తున్నారనీ, అది కూడా ఒక సూపర్‌ హీరో క్యారెక్టర్‌ అని చెప్పుకుంటున్నారు.  వైరల్‌ అవుతున్న బాలయ్య పిక్‌ వెనుక ప్రచారంలోకి వచ్చిన ఈ రెండు విషయాల్లో ఏది నిజం.. నందమూరి బాలకృష్ణ నిజంగానే సూపర్‌ హీరోగా రాబోతున్నారా అనే విషయం తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here