బ్యాటింగ్‌కి స్వర్గధామంగా ఉన్న ముల్తాన్ టెస్టులో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెప్టెన్ జో రూట్ (262),  హ్యారీ బ్రూక్ (317) భారీ స్కోర్లు నమోదు చేసి రికార్డుల మోత మోగించేశారు. తొలుత జో రూట్ డబుల్ సెంచరీ సాధించగా, ఆ తర్వాత హ్యారీ బ్రూక్ ట్రిపుల్ సెంచరీ సాధించి పాక్ బౌలర్ల‌ని ఉతికారేశాడు.

వాస్తవానికి జో రూట్ డబుల్ సెంచరీకి ముందు బాబర్ అజామ్‌కి సింపుల్‌గా క్యాచ్ ఇచ్చాడు. కానీ.. తత్తరపాటులో బాబర్ ఆ క్యాచ్‌ను నేలపాలు చేశాడు. ఒకవేళ ఆ సమయంలో రూట్ వికెట్ పడి ఉంటే.. ఇంగ్లాండ్ టీమ్ జోరుకి కళ్లెం పడేది. కానీ.. లైఫ్ తర్వాత జోరూట్ రెచ్చిపోగా.. బ్రూక్ కూడా గేర్ మార్చాడు. చివరికి ఇంగ్లాండ్ టీమ్‌ 823/7తో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here