తుల

కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఉద్యోగయత్నాలు సానుకూలమవుతాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఊహించిన విధంగానే డబ్బు అందుతుంది. అవసరాలకు లోటు ఉండదు. కుటుంబంలోని అందర్నీ మెప్పించడంలో విజయం సాధిస్తారు. మీ ఆత్మీయత, ప్రేమ చూపుతూ ఆకట్టుకుంటారు. ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. వైద్యసేవలకు నిలిపివేస్తారు. వ్యాపారాలలో లాభాల బాటలో సాగుతారు. నూతన పెట్టుబడులు సమకూరతాయి. విస్తరణలో విజయం సాధిస్తారు. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు రాగలవు. బాధ్యతలు కొంత తగ్గి ఉపశమనం పొందుతారు. రాజకీయవేత్తలు, కళాకారులకు ఆహ్వానాలు అందుతాయి. విదేశీయానం. మహిళలకు భూ, ఉద్యోగలాభాలు. శ్రీ నృసింహధ్యానం మంచిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here