జమ్మిచెట్టు రాష్ట్ర వృక్షంగా గల తెలంగాణ రాష్ట్రంలో జమ్మి ఆకులను బంగారంగా, వాటి కొమ్మలను వెండిగా పంచుతూ పరస్పరం పండుగ శుభాకాంక్షలు తెలుపుకునే సంప్రదాయం ఉంది. ఈ కార్యక్రమాన్ని ‘సోనా దేనా’ అని పిలుస్తారని చిలక‌మ‌ర్తి తెలిపారు. శతాబ్దాలుగా ఈ వేడుక ఐకమత్యానికి కూడా ప్రతీకగా నిలుస్తోంది. ఆంధ్రప్రాంతంలో జమ్మి ఆకులను సేకరించడానికి పార్వేట ఉత్సవం అని పేరు. జమ్మికొట్టుట అని కూడా అంటారు. భక్తులందరూ సమూహంగా తరలి వెళ్లి జమ్మి చెట్టుకు పూజలు చేస్తారు. జమ్మి ఆకులను సేకరిస్తారు. శమీశమయతే పాపం… అనే శ్లోకం రాసిన కాగితాలను జమ్మిచెట్టుకు కడతారు. చెట్టు ఎక్కకుండా కింద నుంచి అందిన ఆకులను తెంచుకుని వచ్చి, పెద్దలకు ఇచ్చి నమస్కరిస్తారని అధ్యాత్మికవేత్త పంచాంగకర్త చిల‌క‌మ‌ర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here