ఈ గ్రామంలోని ప్రజల వద్ద అప్పటికే ఫోన్లు ఉన్నాయి. అయితే ఇంటర్నెట్ లేకపోవడంతో అప్పుడప్పుడు ఫొటోలు తీయడానికి, మాట్లాడుకోవడానికి మాత్రమే వాటిని ఉపయోగించేవారు. అయితే స్టార్‌లింక్ ఇక్కడికి వచ్చాక వారి జీవితాలు మారిపోయాయి. ‘మా తెగలోని ప్రజలు చాలా సంతోషంగా జీవించారు.’ అని అదే తెగకు చెందిన సిగ్నామా మరుబో చెప్పారు. ఇప్పుడు రోజంతా పని మానేసి మొబైల్ ఫోన్లలో నిమగ్నమయ్యారు. పని చేయాల్సిన యువత ఇంటర్నెట్ కారణంగా సోమరిపోతులైపోతున్నారు. మూలాలకు దూరమవుతున్నారు. యువత ఫోన్లలో అశ్లీల వీడియోలు చూస్తున్నారని, ఫోన్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారని తెగ నాయకుడు ఆల్ఫ్రెడో మరుబో చెప్పారు.
Home International Internet Effect : ఈ అమెజాన్ తెగ ఇంటర్నెట్కు బానిసై వేట మరిచిపోతున్నారు.. ఎప్పుడూ ఫోన్లోనే!-this...