నార్మలైజేషన్​ ప్రాసెస్​ ఇలా..

  1. మల్టీ షిఫ్ట్ పేపర్లకు వివిధ షిఫ్టులు/సెషన్లలో అభ్యర్థులు సాధించిన మార్కులను ఎన్టీఏ స్కోర్ (పర్సంటైల్)గా మారుస్తారు.
  2. ఎన్టీఏ స్కోర్​పై వివరణాత్మక ప్రక్రియ.. పర్సంటైల్ స్కోర్ ఆధారంగా నార్మలైజేషన్ ప్రాసెస్​ కింద ఎన్టీఏ వెబ్​సైట్​లో అందుబాటులో ఉంది.
  3. ఒక సబ్జెక్టు పరీక్షను మల్టీ షిఫ్టుల్లో నిర్వహిస్తే.. అభ్యర్థి సాధించిన మార్కులకు అనుగుణంగా ఎన్టీఏ స్కోరును లెక్కిస్తారు. కేటాయింపును నిర్ణయించడం కోసం తదుపరి ప్రాసెసింగ్​ని అన్ని షిఫ్ట్ లు/సెషన్​లకు రా మార్కుల కోసం లెక్కించిన NTA స్కోర్ విలీనం చేస్తారు.
  4. మల్టీ షిఫ్ట్​లకు పర్సంటేజ్​లు భిన్నంగా/అసమానంగా ఉన్న సందర్భాల్లో, అభ్యర్థులందరికీ (అంటే అన్ని షిఫ్టులకు) ఆ కేటగిరీకి అర్హత కటాఫ్ అత్యల్పంగా ఉంటుంది.

యూజీసీ నెట్ పరీక్షని ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 4, 2024 వరకు నిర్వహించారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు షిఫ్టుల్లో నిర్వహించారు. ప్రొవిజనల్ ఆన్సర్ కీని సెప్టెంబర్​లో విడుదల చేయగా, అభ్యంతరాలు తెలిపేందుకు చివరి తేదీ సెప్టెంబర్ 14, 2024గా నిర్ణయించారు. ఇక తాజాగా ఫైనల్​ ఆన్సర్​ కీ బయటకు వచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here