మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) మధ్య బాక్సాఫీస్ వార్ కి తెలుగునాట ఎంతో క్రేజ్ ఉంది. ముఖ్యంగా సంక్రాంతికి ఈ ఇద్దరూ తలబడితే బాక్సాఫీస్ షేక్ అయిపోతుంది. అయితే ఈసారి 2025 సంక్రాంతికి కూడా చిరంజీవి, బాలకృష్ణ పోటీ పడాల్సి ఉండగా.. లాస్ట్ మూమెంట్ లో చిరుకి బదులుగా ఆయన తనయుడు రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చాడు.

బాలకృష్ణ (Balakrishna) తన 109వ సినిమాని బాబీ కొల్లి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘వీర మాస్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. (NBK 109)

రామ్ చరణ్ (Ram Charan) హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ ‘గేమ్ ఛేంజర్’. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీని మొదట క్రిస్మస్ కానుకగా డిసెంబర్ లో విడుదల చేయాలని భావించారు. కానీ సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కావాల్సిన చిరంజీవి ‘విశ్వంభర’ వాయిదా పడటంతో, ఇప్పుడు ఆ తేదీకి ‘గేమ్ ఛేంజర్’ వస్తోంది. (Game Changer)

కాగా, 2019 సంక్రాంతికి కూడా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’తో బాలకృష్ణ, ‘వినయ విధేయ రామ’తో రామ్ చరణ్ బరిలోకి దిగారు. అప్పుడు ఇద్దరికీ నిరాశే ఎదురైంది. మరి ఈసారి ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here