రికార్డుల మోత

ఉప్పల్ స్టేడియంలో బౌండరీల మోత మోగించిన భారత్ జట్టు.. టీ20ల్లో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో భారత్, బంగ్లాదేశ్ బ్యాటర్లు కలిపి ఏకంగా 71 బౌండరీలు నమోదు చేశారు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సార్లు టీ20ల్లో 200 ప్లస్ స్కోరు చేసిన టీమ్‌గా భారత్ నిలిచింది. టీమిండియా ఏడో సారి 200 ప్లస్ స్కోరు చేసింది. ఈ మ్యాచ్‌లో మొత్తం 461 పరుగులు నమోదవగా.. టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు నమోదైన రెండో మ్యాచ్ ఇది. టాప్‌లో 472 పరుగులతో అఫ్గానిస్తాన్, ఐర్లాండ్ టీమ్ మ్యాచ్ ఉంది.

టీ20 ఫార్మాట్‌లో భారత్ జట్టుకి ఇదే అత్యధిక స్కోరు. ఇప్పటి వరకు 2017లో ఇండోర్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఐదు వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. తాజాగా బంగ్లాదేశ్‌పై ఆ రికార్డ్‌ను బద్ధలు కొడుతూ 297 పరుగులు చేసింది. ఓవరాల్‌గా టీ20ల్లో అత్యధిక స్కోరు చేసిన రికార్డ్‌ నేపాల్ టీమ్ పేరిట ఉంది. ఆ జట్టు 2023లో మంగోలియాపై 314 పరుగులు చేసింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here