మెగాబ్రదర్ నాగబాబు(naga babu)గురించిప్రత్యేకంగా పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు.నటుడుగా,నిర్మాతగా ఎన్నో మంచి చిత్రాలు చేసి ప్రేక్షకుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు.ప్రస్తుతం తన సోదరుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీలో క్రియా శీలక పాత్ర పోషిస్తున్నాడు.

సోషల్ మీడియా వేదికగా నా డైరీలో ఒక పేజీ అనే ప్రోగ్రాం ని నిర్వహిస్తున్న నాగబాబు రీసెంట్ గా అందులో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్(amitabh bachchan)గురించి ప్రేక్షకులతో కొన్ని విషయాలని పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ అమితాబ్ బచ్చన్ గారు సినిమా ఇండస్ట్రీలోకి రావడం అంత ఈజీగా జరగలేదు.అవకాశాల కోసం చాలా ఇబ్బంది పడ్డారు.అమితాబ్,రాజీవ్ గాంధీ మొదటి నుంచి ఫ్యామిలీఫ్రెండ్స్ కావడం వలన అమితాబ్ వాళ్ళ ఇంటికి వెళ్తుండే వారు. ఒకసారి ఇందిరా గాంధీ గారితో రికమండేషన్ లెటర్ ఇవ్వమని అమితాబ్ అడిగితే  ఈ అబ్బాయి నాకు బాగా తెలిసిన అబ్బాయి. బాగా యాక్ట్ చేస్తాడు ఒకసారి ట్రై చెయ్యండని ఇందిరాగాంధీ లెటర్ రాసి ఇచ్చేవారు.అయినా కూడా అమితాబ్ కి అవకాశాలు వచ్చేవి కాదు.

పైగా అమితాబ్ గారు సాధారణ వ్యకి కొడుకు వ్యక్తి  కాదు.ఆయన తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్(harivansh rai bachchan)హిందీ సాహిత్య రంగంలో అద్భుతమైన పేరు ఉన్న వ్యక్తి. మన తెలుగు నాట  విశ్వనాథ సత్యనారాయణ, శ్రీ శ్రీ ఎంత పెద్ద కవుల్లో హరివంశ రాయ్ బచ్చన్ కూడా అంత పెద్ద కవి. ఇక అన్నయ్య చిరంజీవి దగ్గరనుంచి మా ఇంటిల్లిపాది మొత్తం అమితాబ్ బచ్చన్ ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్(pawan kalyan)కి అయితే చాలా విపరీతమైన అభిమానం. ఒక్కోసారి పవన్ ని ఏడిపించడానికి  అమితాబ్ బచ్చన్ గారిని సరదాగా విమరించేవాళ్ళం. దాంతో  విపరీతమైన కోపం వచ్చి చేతిలో ఉన్న వస్తువుని విసిరేసేవాడని చెప్పుకొచ్చాడు.  


 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here