కిరణ్ అబ్బవరం(kiran abbavaram)హీరోగా తెరకెక్కిన నూతన చిత్రం ‘క'(ka).1970 వ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి సుజీత్, సందీప్ అనే ఇద్దరు దర్శకత్వం వహించారు. దీపావళి కానుకగా పాన్ ఇండియా లెవల్లో ఈ నెల 31 న విడుదల కాబోతుంది.ఆల్రెడీ  ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ అండ్ టీజర్ తో ప్రేక్షకుల్లో కూడా ‘క’ పై భారీ అంచనాలు ఉన్నాయి. 

తాజాగా మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ జరుగుతుండగా హీరో కిరణ్ అబ్బవరం పలు ఆసక్తి కర విషయాలని వెల్లడి చేసాడు. మొత్తం ఐదు భాషల్లో రిలీజ్ అనుకున్నాం. కానీ తమిళనాడు లో ముప్పై ఒకటిన విడుదల అవ్వడం లేదు. ఎందుకంటే తమిళనాడు లో వాళ్ళ హీరోల సినిమాలు కూడా అదే డేట్ కి రిలీజ్ ఉన్నాయి. థియేటర్స్ దొరకడం కష్టమని, కొన్ని రోజుల తర్వాత రిలీజ్ చేద్దామని ‘క’ తమిళనాడు హక్కులని కొన్న వాళ్ళు చెప్పారని విషయాన్నీ వెల్లడి చేసాడు.  

కిరణ్ చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వడంతో మన తెలుగు నాట సంక్రాంతితో పాటు చాలా ఫెస్టివల్స్ అప్పుడు మన హీరోల సినిమాలు ఉన్నా కూడా తమిళ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అలాంటిది మన హీరోకి తమిళనాట ఎందుకు థియేటర్స్ ఇవ్వరని పలువురు సినీ ప్రేమికులు కామెంట్స్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here