ఎల్‌ఐసీ జీవన్ ఆనంద్ ప్లాన్ వివరాలు

  • ఎండోమెంట్ పాలసీ : అదనపు బోనస్‌లతో పాటు పాలసీదారుడికి హామీ ఇచ్చిన మొత్తాన్ని అందిస్తారు.
  • మెచ్యూరిటీ ప్రయోజనాలు: పాలసీదారుడు పూర్తి కాలం ప్రీమియం చెల్లిస్తే మెచ్యూరిటీ ప్రయోజనాలు లభిస్తాయి.
  • డెత్ బెనిఫిట్స్ : పాలసీదారు మరణిస్తే నామినీకి హామీ ఇచ్చిన మొత్తాన్ని చెలిస్తారు.
  • టాప్-అప్ కవర్ : చాలా తక్కువ మొత్తానికి అదనపు టాప్-అప్ కవర్‌లను అందిస్తారు.
  • జీవితకాల ఆర్థిక రక్షణ: బీమా చేసుకున్న వ్యక్తి మొత్తం జీవితకాలానికి ఆర్థిక భద్రతను లభిస్తుంది.
  • లంప్ సమ్ పేమెంట్: ఎంచుకున్న టర్మ్ పీరియడ్ ముగింపులో ఒకేసారి అధిక మొత్తాన్ని పొందవచ్చు.
  • ప్రవేశ వయస్సు : కనీస ప్రవేశ వయస్సు 18 సంవత్సరాలు, గరిష్టంగా 50 సంవత్సరాలు
  • ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీలో ప్రతి నెలా రూ. 1,358 ప్రీమియం చెల్లిస్తే 35 ఏళ్లలో రూ. 25 లక్షలను పొందవచ్చు. ప్రీమియం వ్యవధి 15 నుంచి 35 సంవత్సరాల వరకు ఉంటుంది.

జీవన్ ఆనంద్ పాలసీ బోనస్

పాలసీలో 35 సంవత్సరాల వ్యవధిలో రూ.5,70,500 మొత్తం డిపాజిట్ చేస్తే రూ.5 లక్షల హామీతో రెండు బోనస్‌లు లభిస్తాయి. మెచ్యూరిటీ తర్వాత పాలసీదారు డిపాజిట్ చేసిన మొత్తంపై అదనంగా రూ.8.60 లక్షల రివిజనరీ బోనస్, రూ.11.50 లక్షల తుది బోనస్‌కు పొందవచ్చు. ఈ బోనస్‌లకు అర్హత సాధించాలంటే 15 సంవత్సరాల కాలవ్యవధి ఉండాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here