రెనాల్ట్​ ఆర్4 ఈ-టెక్..

ప్రస్తుతం జరుగుతున్న పారిస్ ఆటో షోలో లాంచ్ అయిన రెనాల్ట్ ఆర్4 ఈ-టెక్ 400 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంది. దీని అర్థం ఆర్4 ఈ-టెక్ ఈవీ కేవలం ఫ్యామిలీ, నగర-ప్రయాణ వాహనం మాత్రమే కాదు, హైవే రన్​లకు ఆచరణీయమైన ఆప్షన్​ కూడా కావచ్చు. ఇందులో భాగంగా ఎంచుకున్న వెర్షన్​ను బట్టి రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉంటాయి. ఆర్4 ఈ-టెక్ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ కంఫర్ట్ వెర్షన్ 52 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్, 110 కిలోవాట్ల మోటారును పొందుతుంది. ఇది 150 బీహెచ్​పీ, 245 ఎన్ఎమ్ టార్క్​ని ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. ఆర్4 ఈ-టెక్ అర్బన్ రేంజ్ వెర్షన్ 40 కిలోవాట్ల బ్యాటరీ, 90 కిలోవాట్ల మోటారుతో 120 బీహెచ్​పీ పవర్​ని, 225 ఎన్ఎమ్ టార్క్​ని అందిస్తుంది. ఈ వెర్షన్ పరిధి 300 కిలోమీటర్లు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here