‘నిర్దోషిని, 90 శాతం అంగవైకల్యంతో కదల్లేని స్థితిలో వీల్ చైర్‌లో, ఒకరి మద్దుతు లేకుండా తన పని తాను చేసుకోలేని స్థితోలో ఉన్న జీఎన్ సాయిబాబాను అన్యాయంగా పది సంవత్సారాలు ఒంటరిగా అండా సెల్‌లో నిర్బంధించారు. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నా.. జైలులో ఎలాంటి వైద్య సౌకర్యాలు అందకుండా చేశారు. చివరి దశలో నిర్దోషిగా నిరూపించబడి విడుదల చేయాలని మహారాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చినా.. ఆ తీర్పును సవాల్ చేస్తూ.. ఎన్ఐఏ ఆయన విడుదలను అడ్డుకుంది. జైలులో దుర్భర పరిస్థితులను కల్పించి సాయిబాబా ఆరోగ్యం క్షీణించేలా చేశారు. సాయిబాబా మరణానికి బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, న్యాయ వ్యవస్థలే పూర్తి భాధ్యత వహించాలి’ జగన్ ప్రకటనలో డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here