సింహం
ఆరోగ్యం మెరుగవుతుంది. ఉల్లాసంతో పనులు చేస్తారు. పదోన్నతి, స్థానచలన సూచన. రాజకీయ, ప్రభుత్వ పనులు నెర వేరుతాయి. న్యాయ సమస్యలు తీరుతాయి. తాత్కాలిక వ్యాపార ఒప్పందాలు కలిసివస్తాయి. దీర్ఘకాలిక పనులలో ఆటంకాలు రావచ్చు. అన్నదమ్ములు, బంధువర్గంతో ఆప్యాయంగా ఉంటారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. శుభకార్య ప్రయత్నాలలో బంధువుల సహకారం లభిస్తుంది. దత్తాత్రేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.