టాటా కర్వ్ ఈవీ: 5-స్టార్ సేఫ్టీ రేటింగ్

అడల్ట్ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్ టెస్ట్: 30.81/32.00 పాయింట్లు

చైల్డ్ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్ టెస్ట్: 44.83/49.00 పాయింట్లు

టాటా మోటార్స్ నుండి వచ్చిన తాజా ఎలక్ట్రిక్ ఎస్ యూవీ టాటా కర్వ్ ఈవీ. ఇది తాజా భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ లో ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ ను పొందింది. ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ అయిన కర్వ్ ఈవీ పెద్దలు, పిల్లల సేఫ్టీ పరీక్ష ఫలితాల ఆధారంగా రెండో స్థానంలో నిలిచింది. కూపే ఎలక్ట్రిక్ ఎస్ యూవీ అడల్ట్ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్ టెస్ట్ లో 30.81 పాయింట్లు, చైల్డ్ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్ టెస్ట్ లో 44.83 పాయింట్లు సాధించింది. పంచ్ ఈవీతో పోలిస్తే కర్వ్ ఈవీ భద్రతా ఫీచర్ల పరంగా చాలా మెరుగ్గా ఉంది. ఇందులో 6 ఎయిర్ బ్యాగులు, ఎబిఎస్ విత్ ఇబిడి, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, కెమెరా, సీట్ బెల్ట్ రిమైండర్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్, రివర్స్ పార్కింగ్ కెమెరా, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ ఎస్ యూవీలో ఏడీఏఎస్ టెక్నాలజీ, 360 డిగ్రీల కెమెరా వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here