నానితో అనిరుధ్ మూడోసారి
గతంలో నాని హీరోగా నటించిన జెర్సీ, గ్యాంగ్‌లీడర్ సినిమాలకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. జెర్సీ మూవీలో తన మ్యూజిక్‌తో ఆకట్టుకున్నారు. గ్యాంగ్లీడర్లోనూ మంచి ట్యూన్స్ ఇచ్చారు. ఇప్పుడు మూడోసారి నాని మూవీ కోసం అనిరుధ్ పని చేయనున్నారు. అయితే, శ్రీకాంత్ ఓదెల ఈ మూవీని ఇంటెన్స్ యాక్షన్ మూవీగా తెరకెక్కించనున్నారు. అనిరుధ్ ఈ రకం సినిమాలు బాగా సూటవుతాయి. మరి, నానికి ఎలాంటి మ్యూజిక్ ఇస్తారో చూడాలి.