భారత్, కెనడాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు 8 బిలియన్ డాలర్లు. ఇందులో ప్రధానంగా భారతదేశం కెనడా నుండి పప్పుధాన్యాలు, పొటాష్, చమురు, గ్యాస్‌ను దిగుమతి చేసుకుంటుంది. భారత్ కెనడాకు ఫార్మాస్యూటికల్స్, టెక్స్టైల్స్, ఐటీ సేవలు, ఆభరణాలను ఎగుమతి చేస్తుంది. దౌత్య సంబంధాలలో పెరుగుతున్న ఇబ్బందులతో వాణిజ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఇది వ్యాపార భాగస్వామ్యాలు, సరఫరాలో అంతరాయాలకు దారితీస్తుంది. ప్రస్తుత రాజకీయ వాతావరణం ఇరు దేశాల వాణిజ్య అవకాశాలను దెబ్బతీసింది. ఇది వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, సాధారణ ప్రజలకు హాని కలిగిస్తుంది.