TG IAS Officers: కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ హైదరాబాద్‌లో ఊరట దక్కకపోవడంతో ఏపీ, తెలంగాణలలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు తమకు కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్ట్ చేశారు. ఏపీకి కేటాయించినా గత పదేళ్లుగా తెలంగాణలో కొనసాగుతున్న వాకాటి కరుణ, వాణీ ప్రసాద్, ఆమ్రపాలి, రొనాల్డ్ రోస్ గురువారం ఉదయం వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో చీఫ్ సెక్రటరీకి రిపోర్ట్ చేశారు. బుధవారం వారు దాఖలు చేసిన లంచ్‌మోషన్ పిటిషన్‌పై స్టే ఇవ్వడానికి క్యాట్ నిరాకరించడంతో నలుగురు అధికారులు ఏపీలో రిపోర్ట్ చేశారు. అంతకు ముందే వారు మెయిల్ ద్వారా ఏపీ సీఎస్‌కు సమాచారం అందించారు.
Home Andhra Pradesh ఏపీ సీఎస్‌కు రిపోర్ట్ చేసిన నలుగురు ఐఏఎస్ అధికారులు, తెలంగాణలో రిపోర్ట్ చేసిన ముగ్గురు అధికారులు-four...