గోపిచంద్(gopi chand)హీరోగా విజయదశమి కానుకగా అక్టోబర్ 11 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ విశ్వం(viswam)శ్రీను వైట్ల(srinu vaitla)దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ విడుదలైన అన్ని చోట్ల కూడా మంచి ప్రేక్షకాదరణని పొందుతుంది.పైగా చాలా రోజుల తర్వాత ప్రేక్షకులందరు మూవీ లోని  కామెడీ కి థియేటర్ లో విరగబడి నవ్వుతున్నారు.ముఖ్యంగా థర్టీ ఇయర్స్ పృథ్వీ(Prudhvi Raj)పండించిన కామెడీ అయితే ఒక రేంజ్ లోనే నవ్వులు పూయిస్తుంది.  

రీసెంట్ గా విశ్వం సక్సెస్ మీట్ జరిగింది. అందులో గోపిచంద్, శ్రీను వైట్లతో పాటు మూవీలో నటించిన ప్రధాన తారాగణం మొత్తం పాల్గొంది. ఈ సందర్భంగా పృథ్వీ మాట్లాడుతూ గోపి చంద్ గారు ఎప్పుడో అమృతం తాగి  ఉంటారు.ఎందుకంటే కల్మషం లేని నవ్వు, ఆప్యాయత,పలకరింపు, ఆయన సొంతం.ఇన్ని రోజులు రచయిత గోపి మోహన్(gopi mohan)ని శోభన్ బాబు(shobhan babu) అని అనే వాళ్ళం.ఇక నుంచి గోపి చంద్ గారిని శోభన్ బాబు అని పిలవాలి.నేను ఎక్కువగా చేసింది గోపి చంద్ గారి సినిమాలే. 

 విశ్వం లో గోపి గారు  డాన్స్ లు గాని ఫైట్స్ గాని చాలా అద్భుతంగా చేసారు.లౌక్యం సినిమా కమర్షియల్ గా నాకు చాలా డబ్బు లు ఇచ్చిందని చెప్పుకొచ్చాడు.ఇప్పడు ఈ మాటలు గోపి చంద్ అభిమానులతో పాటు ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్నాయి.  అనంతరం గోపి చంద్ కూడా మాట్లాడుతూ పృథ్వీ మాటలకి తన కృతజ్ఞతలని తెలిపాడు.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here