బౌలింగ్ చేస్తే వికెట్
న్యూజిలాండ్ బౌలర్లు ఓవర్ వేస్తే వికెట్ అనేలా వరుసగా భారత్ బ్యాటర్లు వికెట్లు సమర్పించుకున్నారు. పిచ్ పేసర్లకి అనుకూలించడంతో న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ తెలివిగా టిమ్ సౌథీ, మాట్ హెన్రీ, విలియమ్‌తో మాత్రమే వరుసగా బౌలింగ్ చేయిస్తూ భారత్ బ్యాటర్లకి కుదురుకునే అవకాశం ఇవ్వలేదు. న్యూజిలాండ్ టీమ్‌లో టిమ్ సౌథీ ఒక వికెట్ తీయగా.. మాట్ హెన్రీ 5 వికెట్లు, విలియమ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇన్నింగ్స్ మొత్తం ఈ ముగ్గురూ తప్ప ఎవరూ బౌలింగ్ చేయలేదు.