సీనియర్ నటి రమాప్రభ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆమె సోదరి తనయుడు సురేష్ ఆకస్మికంగా మరణించారు. ఇటీవల రాజేంద్రప్రసాద్ కుమార్తె మృతి చెందిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి 11 రోజుల కార్యక్రమంలో సురేష్ పాల్గొన్నారు. ఆ సమయంలోనే అస్వస్థతకు గురి కావడంతో బెంగళూరులోని ఓ హాస్పిటల్‌కు సురేష్‌ను తరలించారు. కొన్ని రోజులు వైద్యం అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. గత 9 నెలలుగా కిడ్నీకి సంబంధించిన వ్యాధితో సురేష్ బాధపడుతున్నారని తెలిసింది.
రమాప్రభ సమర్పణలో రూపొందిన ‘అప్పుల అప్పారావు’ వంటి సినిమాలకు సురేష్ నిర్మాతగా వ్యవహరించారు. అంతేకాదు, మదనపల్లిలో రాజకీయంగా కూడా సురేష్ బాగా ఎదిగారు. చిన్న వయసులోనే తమ సహచరుడు మృతి చెందడంతో మదనపల్లిలోని రాజకీయ ప్రముఖులు తీవ్రమైన విషాదంలో ఉన్నారు.