1:1 బోనస్ షేర్లు
షేర్ హోల్డర్ల ఆమోదానికి లోబడి 1:1 నిష్పత్తిలో (ప్రతి 1 ఈక్విటీ షేరుకు 1 ఈక్విటీ షేర్) వాటాదారులకు బోనస్ షేర్లను (ఏడీఎస్ హోల్డర్లకు స్టాక్ డివిడెండ్ తో సహా) జారీ చేయాలని విప్రో బోర్డు సిఫార్సు చేసింది. ‘‘క్యూ2లో పటిష్టమైన పనితీరు ఆధారంగా ఆదాయ వృద్ధి, బుకింగ్స్, మార్జిన్ల అంచనాలను అందుకోగలిగాం. మా పెద్ద డీల్ బుకింగ్స్ మరోసారి 1 బిలియన్ డాలర్లను అధిగమించాయి. క్యాప్కో వరుసగా మరో త్రైమాసికంలో తన జోరును కొనసాగించింది. బీఎఫ్ ఎస్ ఐ, కన్జ్యూమర్ అండ్ టెక్నాలజీ, కమ్యూనికేషన్స్ రంగాలతో పాటు నాలుగు మార్కెట్లలో మూడింటిలో వృద్ధి సాధించాం. మా క్లయింట్లు, మా వ్యూహాత్మక ప్రాధాన్యాలు, బలమైన కృత్రిమ మేధ ఆధారిత విప్రో (wipro) ను నిర్మించడంలో మేము పెట్టుబడిని కొనసాగిస్తాము’’ అని విప్రో సీఈఓ, ఎండీ శ్రీని పలియా అన్నారు.