రీసెంట్ గా చూస్తే మూవీస్ కానీ ఇంకొన్ని షోస్ ప్రొమోషన్స్ ని ఓ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. ఊహించని విధంగా వాళ్ళ వాళ్ళ ప్రోగ్రామ్స్ ని ప్రోమోట్ చేస్తూ కొత్తగా ట్రై చేస్తున్నారు. ఇక ఇప్పుడు పొట్టెల్ అనే మూవీ ప్రొమోషన్స్ చూస్తే భలే కామెడీగా అనిపించింది అలాగే కొత్త ఐడియా కదా అనిపించింది. ఈ నెల 25 న రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ప్రొమోషన్స్ ఆ టీమ్ వాళ్ళే చేసేసుకున్నారు. అనన్య, నోయెల్, యువ చంద్ర ఫ్లయిట్ లో మూవీ ప్రొమోషన్ పోస్టర్స్ ని పంచారు. ఇక నెటిజన్స్ ఐతే కామెంట్స్ మాములుగా చేయలేదు. “బ్రో పోస్టర్ తో పాటు స్నాక్స్ కూడా ఇవ్వాల్సింది కదా…ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు.
నాకు ఫ్లయిట్ టికెట్ వేస్తేనే మూవీ చూస్తా..ఆమ్మో ఫ్లయిట్ ని కూడా ఇలా ప్రమోషన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అని ఇప్పుడే తెలిసింది. కంటెంట్ ఉంటె ప్రొమోషన్ తో పని లేదు. ఫ్లయిట్స్ లో వెళ్లే వాళ్ళు మూవీస్ చూడరు. రిచ్ పీపుల్..వాళ్ళు ఓటిటి చూస్తారు. అదే మాస్ వాళ్ళు సినిమాలు చూస్తారు..అందుకే మాస్ పబ్లిక్ లో రీచ్ వస్తుంది. ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక లాస్య మంజునాథ్ ఐతే సూపర్ అని కామెంట్ చేసింది.