సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu)దర్శకధీరుడు రాజమౌళి(rajamouli)కాంబోలో ఒక మూవీ తెరకెక్కబోతుందనే విషయం తెలిసిందే.స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్(vijayendra prasad)ఆ చిత్రానికి కథని అందిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం ఆయన  మాట్లాడుతూ కథ తయారు చెయ్యడానికే రెండేళ్ల సమయం పట్టిందని,నెక్స్ట్ ఇయర్ జనవరిలో సినిమా ప్రారంభమవుతుందని చెప్పుకొచ్చాడు.దీంతో   ఆ శుభమూర్తం కోసం మహేష్ జక్కన్న ఫ్యాన్స్ తో పాటు పాన్ ఇండియా మూవీ లవర్స్ సైతం  ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పుడు ఆ మూవీకి సంబంచిన తాజా న్యూస్ ఒకటి ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది.మూవీని రెండు బాగాలుగా తెరకెక్కించే ప్లాన్ లో జక్కన్న ఉన్నాడని అంటున్నారు.అమెజాన్ అడవుల నేపథ్యంలో జరిగే అడ్వెంచర్ మూవీ కావడంతో కథలో ఎంతో స్పాన్ ఉందని, కాబట్టి రెండు మూడు గంటల్లో చెప్పడం కుదరదని, అందుకే  రెండు భాగాలుగా తెరకెక్కిస్తారనే యోచనలో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.చిత్ర యూనిట్ కూడా జక్కన్న నిర్ణయానికి ఓకే అందని తెలుస్తుంది. మరి ఇదే కనుక నిజమైతే  ప్రభాస్ లాగా మహేష్ కూడా వరుసగా జక్కన్న తోనే రెండు సినిమాలకి కమిట్ అయినట్టు అవుతుంది.

 

అదే విధంగా గ్లోబల్ ఫిలిం గా తీసుకువచ్చే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని,అందుకోసమే హాలీవుడ్ తో పాటు వివిధ భాషలకి చెందిన  బిగ్ స్టార్స్ కూడా నటించబోతున్నారని  వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా జక్కన్న అధికారకంగా ప్రకటించేంత వరకు ఈ విషయాల్లో పూర్తి క్లారిటీ రాదు. చాలా రోజుల నుంచి ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే జరుగుతూ ఉంది. దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ(kl narayana) ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.ఈయన గతంలో హలోబ్రదర్, దొంగాట,ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు, క్షణక్షణం,సంతోషం వంటి హిట్ చిత్రాలని నిర్మించాడు.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here