ట్యూబ్ క్రాప్ టాప్
ట్యూబ్ క్రాప్ టాప్ తప్పకుండా మీ వార్డ్‌రోబ్ లో ఉండాల్సిందే. కొన్ని రకాల దుస్తులకు కామిసోల్ వేసుకోలేరు. కొన్ని టాప్స్, షర్టులకు హాఫ్ షోల్డర్ లేదా కాలర్ లెస్, స్లీవ్స్ సన్నగా ఉండే రకాలు ఉంటాయి. అలాంటివాటికి క్యామిసోల్ నప్పదు. అలాంటప్పుడు బ్రా కనిపించకుండా, మంచి కవరేజీ కూడా ఇచ్చేలా ఈ ట్యూబ్ క్రాప్ టాప్స్ వాడొచ్చు. దాంతో డ్రెస్సులు పారదర్శకంగా ఉన్నా, స్లీవ్స్ లేకున్నా, నెక్ డీప్ ఉన్నా కూడా ఏ ఇబ్బందీ ఉండదు.