ఇంటిని శుభ్రం చేసుకోవడం ఎంత ముఖ్యమో మనందరికీ తెలిసిందే. పండుగల సందర్భంగా కచ్చితంగా ఇంటని శుభ్రం చేస్తారు. పండుగలకు ముందు ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించేందుకు డీప్ గా శుభ్రం చేయాలి. భారతీయ గృహాలలో, చీపురు ఊడ్చిన తరువాత నీటితో మాప్ పెడతారు. అలా చేస్తేనే పరిశుభ్రంగా ఉంటుంది ఇల్లు. వాస్తవానికి, మీ వంటగదిలో ఉంచిన కొన్ని వస్తువులు మాప్ నీటిలో కలపడం ఇంటిని శుభ్రపరచడంలో సహాయపడటమే కాకుండా, ఇంట్లోని ప్రతికూల శక్తిని కూడా తొలగిస్తుంది. మాప్ పెట్టేటప్పుడు ఏ వస్తువులు కలపాలో తెలుసుకోండి.