చంద్రబాబు వార్నింగ్..
మద్యం, ఇసుక వ్యవహారంలో కూటమి నేతలు, నాయకులు, కార్యకర్తలు జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు. దీంతో కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గాల ఇంఛార్జ్‌లు వెనక్కి తగ్గారు. కానీ.. ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రం అస్సలు తగ్గడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందనే వాదన వినిపిస్తోంది.