తెలంగాణ ఎన్నికల్లో బొక్కా బోర్ల పడిన బీఆర్ఎస్.. 2024లో ఏపీలో జరిగిన ఎన్నికల ఊసు కూడా ఎత్త లేదు. అదే మాదిరిగా ఇపుడు మహారాష్ట్ర శాసన సభ ఎన్నికల గురించి కూడా మాటెత్తే అవకాశమే లేదంటున్నారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని, కాంగ్రెస్, బీజేపీయేతర తృతీయ కూటమి కట్టాలని, జాతీయ పార్టీగా వెలుగు వెలగాలని ఆశించిన బీఆర్ఎస్‌కు.. ఆ పార్టీ నేత కేసీఆర్ కలలు కల్లలు అయినట్లే కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.