హమాస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ ఇజ్రాయెల్ దళాల చేతిలో హతమయ్యాడు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ జరిపిన దాడుల్లో సిన్వార్ మృతి చెందాడని అధికారికంగా ఇజ్రాయెల్ ధ్రువీకరించింది. డీఎన్ఏ పరీక్షల ద్వారా ధ్రువీకరించినట్లు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కాంట్జ్ తెలిపారు. తాజాగా ఇజ్రాయెల్ దళాలు డ్రోన్ పుటేజిని విడుదల చేశాయి. ఈ వీడియోలో చనిపోయే ముందు సిన్వార్ కదలికలకు సంబంధించిన దృశ్యాలు ఉన్నాయి.