కొంత మంది హీరోయిన్లకి పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు.అలాంటి వాళ్ళల్లో మిల్క్ బ్యూటీ తమన్నా(tamannaah)కూడా ఒకటి. మంచు మనోజ్(manchu manoj)హీరోగా వచ్చిన శ్రీ అనే మూవీతో తెలుగు తెరకి పరిచయమైన తమన్నా ఆ తర్వాత అగ్ర హీరోలందరితో జోడి కట్టి టాప్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళింది.ప్రెజంట్ సోలో హీరోయిన్ గా తన హవా తగ్గినా కూడా ఐటెం సాంగ్స్ ల్లో మాత్రం తన సత్తా చాటుతుంది. తమన్నా ఐటెం సాంగ్ ఉంటే సినిమా హిట్ అనే క్రెడిట్ ని కూడా పొందింది.
రీసెంట్ గా ఆమె భారతదేశంలో జరిగే ఆర్థిక నేరాలపై విచారణ జరిపే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ed)ఎదుట హాజరయ్యింది. తమన్నా గతంలో మహాదేవ్ ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ యాప్ కి ప్రమోటర్ గా వ్యవహరించడంతో పాటుగా ఆ సంస్థ జరిపిన ఈవెంట్ కూడా హాజరయ్యింది.ఇందుకు గాను తమన్నా భారీ మొత్తంలో డబ్బు తీసుకుంది.ఆ తర్వాత క్రిఫ్టో కరెన్సీ పేరుతో యాప్ నిర్వాహకులు పలువురిని మోసం చేసి కొన్ని కోట్ల రూపాయలని దండుకున్నారు.ఈ యాప్ కి గవర్నమెంట్ నుంచి ఎలాంటి పర్మిషన్ లేదు.చట్టాలను ఉల్లంగిస్తు నిర్వహించే అనధికార యాప్ లకి ప్రచారం చేయడం నేరం.ఈ కారణం చేతనే తమన్నాని అస్సాంలోని గౌహతిలో ఈడీ విచారించింది. గురువారం మధ్యాహ్నం 1:25 గంటలకు తమన్నా ఈడీ కార్యాలయానికి రాగా సుధీర్ఘంగా విచారించినట్టుగా తెలుస్తోంది.
తమన్నాతో పాటుగా ఆమె తల్లిదండ్రులు కూడా వెంటవచ్చారు. తల్లి బయటే కారులో ఉండగా తండ్రి ఆమెతో పాటుగా ఆఫీస్ లోపలకి వెళ్లారు. .తమన్నా ప్రస్తుతం తెలుగులో ఓదెల 2 అనే మూవీ చేస్తుంది. సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలోశివుడ్ని ఆరాధించే శివ శక్తీ క్యారక్టర్ లో కనపడబోతుంది.