వెండితెరపైనే కాదు, బుల్లితెరపై హోస్ట్‌గా ఎంతో పాపులారిటీ తెచ్చుకుంటున్నారు నందమూరి బాలకృష్ణ. ‘ఆహా’లో గత కొంతకాలంగా స్ట్రీమ్ అవుతున్న అన్‌స్టాపబుల్ షోలో ఎంతో ఉత్సాహంగా, మరెంతో చమత్కారంగా అతిథులతో ముచ్చటిస్తూ ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని పంచుతున్న బాలకృష్ణ ఇప్పుడు నాలుగో సీజన్‌కి రెడీ అవుతున్నారు. బాలకృష్ణ ఈ షోను అంత సమర్థవంతంగా నిర్వహించగలరని ఎవరూ ఊహించలేదు. కానీ, ఒక సీజన్ మించి మరో సీజన్ అన్నట్టుగా ఆడియన్స్‌లో క్యూరియాసిటీని క్రియేట్ చేస్తూ తప్పక చూడాల్సిన షోగా అన్‌స్టాపబుల్‌ను తీర్చిదిద్దారు బాలకృష్ణ. ఇప్పుడీ షో ఇండియాలోనే నెంబర్ వన్ షో అనిపించుకుంటోంది.
ఇప్పుడు నాలుగో సీజన్‌లో అల్లు అర్జున్, మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున గెస్టులుగా పాల్గొంటారని సోషల్ మీడియాలో డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి నాలుగో సీజన్ మొదటి గెస్ట్‌గా వస్తారని వార్తలు వచ్చాయి. అయితే అందరి ఊహల్ని తారుమారు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తొలి గెస్ట్‌గా రాబోతున్నారు. దీనికి సంబంధించిన ఎపిసోడ్‌ను అక్టోబర్ 20న చిత్రీకరిస్తారు. మునుపటి సీజన్‌లో చంద్రబాబుతో కలిసి నారా లోకేష్ వచ్చారు. ఆ ఎపిసోడ్ అంతా ఎంతో సరదాగా సాగింది.
ఈసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు ఈ షోకి హాజరవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను పునర్నిర్మిండమే లక్ష్యంగా ఉన్న చంద్రబాబుతో బాలకృష్ణ ఎలా ఇంటరాక్ట్ అవుతారు అనే అంశం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ఈసారి చంద్రబాబుతోపాటు ఈ షోకి ఎవరెవరు హాజరవుతారు అనే క్యూరియాసిటీ కూడా అందరిలోనూ ఉంది. మరి ఏం జరగనుందో తెలియాలంటే ఎపిసోడ్ ప్రసారం అయ్యేవరకు వేచి చూడక తప్పదు.