సమంత(samantha)ప్రస్తుతం తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ సిటాడెల్ హానీ బన్నీ(citadel honey bunny)సిరీస్ కి సంబంధించిన ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది.బాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకడైన వరుణ్ ధావన్(varun dhavan)హీరోగా చేస్తున్న ఈ సిరీస్ నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.తొలుత ఇందులో నటించడానికి సమంత ఒప్పుకోకపోయినా కూడా మేకర్స్ ఆమెని ఒప్పించి మరి ఇందులో నటింపచేసారు.ఫ్యామిలీ మాన్ 2 ని తెరక్కెక్కించిన తెలుగు దర్శకులు రాజ్ అండ్ డీకే(raj and dk)ద్వయం ఈ సిరీస్ కి దర్శకులుగా వ్యవహరిస్తుండంతో ప్రేక్షకులలో భారీ అంచనాలే ఉన్నాయి. ఫ్యామిలీ మాన్ 2 సమంత కి మంచి పేరు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో వరుణ్ మాట్లాడుతు సమంత లాంటి టాలెంటెడ్ యాక్టర్ తో నటించడం చాలా హ్యాపీగా ఉంది. స్క్రీన్ షేర్ చేసుకొనే అవకాశం రావడం కూడా అదృష్టంగా భావిస్తున్నాను.మా లాంటి హీరోలతో పాటు ధీటుగా ఆమె చేసే ఫైట్స్ గూస్ బంప్స్ తీసుకొస్తాయి.అందుకే నేను ఆమెకి ఫిదా అయిపోయాను.ఇప్పుడే కాదు గతంలో ఆమె నటించిన ఈగ సినిమా చూసినప్పుడే ఫిదా అయిపోయాను. ఆమెకి నేను పెద్ద అభిమానిని అని కూడా చెప్పుకొచ్చాడు.ఇప్పుడు ఈ వ్యాఖ్యలునెట్టింట వైరల్ గా మారాయి.
ఎంటర్ టైన్మెంట్ చిత్రాలకి కేర్ ఆఫ్ అడ్రస్స్ గా నిలిచిన ప్రముఖ దర్శకుడు డేవిడ్ ధావన్ కొడుకైన వరుణ్ 2012 లో వచ్చిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అనే చిత్రం ద్వారా పరిచయమయ్యాడు.ఏబిసిడి 2 ,దిల్ వాలే,అక్టోబర్, కల్నక్, బవల్ వంటి హిట్ చిత్రాల్లో నటించాడు. లేటెస్ట్ గా స్త్రీ 2(stree 2)లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో చేసి ప్రేక్షకులని మెప్పించాడు.