ఎడిబుల్ గోల్డ్ దొరుకుతోందిలా :
మనం తినాడానికి వీలుగా ఉండే ఎడిబుల్ గోల్డ్ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉంటోంది. గోల్డ్ లీఫ్లు, గోల్డ్ ఫ్లేక్స్, గోల్డ్ డస్ట్… లాంటి అనేక రూపాల్లో ఇది లభ్యం అవుతోంది. ఈ ఎడిబుల్ గోల్డ్ తప్పకుండా 23 లేదా 24 క్యారెట్ల బంగారంతో తయారవుతుంది. రెండు వందల రూపాయలల్లో చిన్న షీట్ నుంచి మొదలుగొని ఇవి దొరకడం ప్రారంభం అవుతాయి. ఇలా నచ్చిన రూపంలో ఉన్న గోల్డ్ కొనుక్కుని ఆరగించేందుకు వాడేయొచ్చు. సమోసాలు, బజ్జీలు, ఐస్ క్రీములు, స్వీట్లు ఇలా మీరు వండిన దేని మీదైనా సరే కాస్త ఈ బంగారు పొడిని చల్లేయొచ్చు. ఆ విందును మరింత విలాసవంతంగా మార్చేయవచ్చు.