యూ ట్యూబ్‌లో ఎంతో పాపులర్ అయిన హర్షసాయిపై బిగ్‌బాస్ ఫేమ్ మిత్రాశర్మ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తనను లైంగికంగా వేధించాడని, రేప్ చేశాడని ఆ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో హర్షసాయిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. మిత్రశర్మ తాజాగా ఆర్.జె. శేఖర్‌బాషాపై కూడా ఫిర్యాదు చేయడంతో అతన్ని అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. ప్రస్తుతం సైబర్ క్రైమ్ ఆఫీస్‌లోనే ఉన్నారు శేఖర్ బాషా. పోలీసులు అతన్ని మూడు గంటలుగా విచారిస్తున్నారు. మిత్రశర్మపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నందుకు కొన్ని యూట్యూబ్ ఛానల్స్‌లో ఆమెపై అసత్య ప్రచారాలు చేసినందుకు శేఖర్ భాషాపై బాధితురాలు ఫిర్యాదు చేసింది.
హర్షసాయి విషయానికి వస్తే.. తనను రేప్ చేయడమే కాకుండా నగ్నవీడియోలు తీసి తనను బెదిరిస్తున్నాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మిత్రశర్మ పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నప్పటికీ హర్షసాయిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. అతను ఎక్కడ ఉన్నాడు అనే విషయాన్ని పోలీసులు కనిపెట్టలేకపోతున్నారు. అతను పరారీలో ఉన్నాడని భావిస్తున్నారు. ఈలోగా పలువురు యూట్యూబర్లచేత మిత్రశర్మపై దుశ్ప్రచారం చేయిస్తున్నాడనే ఆరోపణలు కూడా హర్షసాయిపై ఉన్నాయి. ఇదిలా ఉంటే.. బిగ్‌బాస్ తాజా సీజన్ ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో కంటెస్టెంట్‌గా పాల్గొన్న శేఖర్ బాషా కొద్దిరోజుల్లోనే బయటకు వచ్చేయడం గమనించాల్సిన విషయం.