వెబ్ సిరీస్ : 1000 Babies
నటీనటులు: రెహమాన్, నీనా గుప్త, అశ్విన్ కుమార్, అదిల్ ఇబ్రహీమ్, వివియ సంత్, ఇర్షద్ తదితరులు
ఎడిటింగ్: జాన్ కుట్టీ
సినిమాటోగ్రఫీ: ఫయాజ్ సిద్దీఖీ
మ్యూజిక్: శంకర్ శర్మ
నిర్మాతలు: షాజీ నదీశన్
దర్శకత్వం: నజీమ్ కోయ
ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్ స్టార్
కథ:
ఓ అడవిలో పాతబడిన ఇల్లు.. అందులో ఓ ముసాలివడ. తన పేరు సారా ఓసెఫ్(నీనా గుప్త) సరిగ్గా నడవడం కూడా రాదు. కానీ ఆమె అరిచే అరుపుతో పొద్దున్నే పేపర్ వేయడానికి వచ్చినవాడు కూడా భయపడతాడు. ఇక కొంతసమయం తర్వాత తను ఓ గోడ మీద ఏవో పిచ్చిరాతలు రాసుకుంటుంది. అలా రాస్తుండగా తన దగ్గరున్న మార్కర్స్ అయిపోతాయి. ఇక వాటిని తీసుకురమ్మని కొడుకు బిబిన్ ఓసెఫ్(సంజూ శివరామ్) కి చెప్తుంది. ఇక తను తీసుకురాగానే వెళ్లి మళ్లీ రాసుకుంటుంది. ఇక కొన్ని రోజులకి తన కొడుకుకి ఓ నిజం చెప్తుంది సారా ఓసెఫ్. కాసేపటికి తను అనూహ్యమైన రీతిలో చనిపోతుంది. అయితే తను చనిపోయేమందు ఓ లెటర్ పోలీస్ కి, మరో లెటర్ కోర్ట్ లోని లాయర్ కి ఇస్తుంది సారా. ఆ లెటర్ లో ఓ కాన్ఫిడెన్షియల్ అండ్ సీక్రెట్ ఉంటుంది. అది తెలుసుకున్న వాళ్ళిద్దరు షాక్ అవుతారు. కొన్ని రోజులకి అనూహ్య రీతిలో హత్యలు జరుగుతుంటాయి. సారా ఓసెఫ్ ఆ లెటర్ లో రాసిందేంటి? అసలెందుకని వాళ్ళిద్దరు షాక్ అవుతారు. ఆ హత్యల వెనుక ఉందెవరనేది మిగతా కథ.
విశ్లేషణ:
ఈ వెబ్ సిరీస్ ఓ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్. ఇది మొదలవ్వడమే స్లోగా మొదలవుతుంది. మొదటగా ఆ ముసలావిడ ఎందుకలా చేస్తుందో ఎవరికి అర్థం కాదు. ఆ తర్వాత తన కొడుకు ఎందుకు అలా ఉన్నాడో కూడా తెలియదు మ అయితే వారిద్దరు కలిసి ఏదో సీక్రెట్ ని దాస్తున్నారనే విషయం మాత్రం అర్థమవుతుంది. అదే విషయాన్ని కాస్త డీటేయిలింగ్ ఇస్తూ దర్శకుడు కథని నడిపించిన తీరు బాగుంది.
మొదటి రెండు ఎపిసోడ్ లలో కథ సీరియల్ లా సాగుతుంది. ఇక ఓ క్రైమ్ ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఎప్పుడైతే అజీ కురియన్ ఎంట్రీ ఇస్తాడో అప్పటి నుండి కథ వేగంగా పరుగులు తీస్తుంది. ఓ కేసులోని లోతుని తెలుసుకోడానికి అజీ తన టీమ్ చేసే ఇన్వెస్టిగేషన్ ప్రేక్షకుడిని చివరి వరకు చూసేలా చేస్తుంది.
అయితే సిరీస్ చూడాలనుకునే ప్రేక్షకుడికి నిడివి కాస్త ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే ఒక్కో ఎపిసోడ్ నలభై నుండి యాభై నిమిషాల వరకు ఉంటుంది. ఇక కథని ప్రీక్వెల్, సీక్వెల్, లెగెసీ, ఫస్టాఫ్ ఇంటర్వెల్, సెకెంఢాఫ్, యాంటీ క్లైమాక్స్ అంటు ఒక్కో ఎపిసోడ్ కి పేర్లు ఇచ్చారు మేకర్స్. దానికి తగ్గట్టుగానే కథ వెనుకకి ముందుకు వెళ్తుంటుంది. సిరీస్ లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ప్రతీ ఒక్క ప్రేక్షకుడిలో చాలా ప్రశ్నలు మొదలవుతాయి. అయితే సీరియల్ హంతకుడిని అజీ ఎలా పట్టుకుంటాడనేది కాస్త లాజిక్ లేకుండా ఉంటుంది. అయితే చివరి ఎపిసోడ్ లో వచ్చే ట్విస్ట్ తో మరో భాగానికి ఆజ్యం పోసినట్టైంది. అదేంటనేది సిరీస్ చూస్తూనే తెలుస్తోంది. ఇది ఫ్యామిలీతో కలిసి చూడలేం. కొన్ని చోట్ల అశ్లీల దృశ్యలు ఉంటాయి. మరికొన్ని చోట్ల రక్తం కన్పిస్తుంది. ఇక సినిమాటోగ్రఫీ సిరీస్ కి ప్రధాన బలంగా నిలిచింది. బిజిఎమ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
బిబిన్ ఓసెఫ్ గా సంజూ శివరామ్, సారా ఓసెఫ్ గా నీనా గుప్త ఆకట్టుకున్నారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అజీ గా రెహమాన్ సిరీస్ కి ప్రధాన బలంగా నిలిచాడు. ఇక మిగతా వారంతా వారి పాత్రల పరిధి మేర నటించారు.
ఫైనల్ గా : కాస్త సాగదీతగా సాగే సూపర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. మస్ట్ వాచ్ విత్ ఎలోన్.
రేటింగ్: 2.75 / 5
✍️. దాసరి మల్లేశ్