అర్హతలు :
- ఫార్మాసిస్ట్ గ్రేడు-II పోస్టుకు పదో తరగతి ఉత్తీర్ణత సాధించాలి. డి.ఫార్మాసీ, బి. ఫార్మసీ పూర్తి చేసి ఉండాలి.
- ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II పోస్టుకు డిప్లొమా ఎంఎల్టీ, బీఎస్సీ ఎంఎల్టీ పూర్తి చేసి ఉండాలి. ఇంటర్మీడియట్ ఒకేషనల్ అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో ఏడాది పాటు అప్రంటిస్ పూర్తి చేసి ఉండాలి.
- డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు పదో తరగతి, ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి. అలాగే ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి. పీజీడీసీఏ కోర్సు ఉత్తీర్ణత అయి ఉండాలి.
- లాస్ట్ గ్రేడ్ సర్వీస్ పోస్టుకు పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
దరఖాస్తు ఫీజు ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.300, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగు అభ్యర్థులకు రూ.100 ఉంటుంది. అప్లికేషన్ ఫీజును “జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి, కృష్ణా జిల్లా” పేరు మీద డీడీ తీయాలి. ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేస్తే, ప్రతి పోస్టుకు ఫీజును డీడీ తీయాలి.