ఇక చాలు
తాను ఇప్పటి వరకు హౌస్‌లో ఆడింది చాలని, బయటికి వెళ్లిపోవాలని అనుకుంటున్నాననేలా మణికంఠ మాట్లాడారు. “నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత వరకు నేను వచ్చా. చాలా నేర్చుకున్నా. ప్రేక్షకులు, ఆడియన్స్, నాగ్ సర్ చాలా నేర్పించారు. నేర్చుకుంది చాలు. నేర్చుకునే ఓపిక ఇక లేదు. ఇక నేను పొరపాట్లు చేయలేను. నేర్చుకున్న దాన్ని అమలు చేస్తూ లైఫ్‌ను ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నా” అని బిగ్‌బాస్‌కు మణికంఠ తన గోడు చెప్పుకున్నారు.